విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి.. పది రోజుల క్రితం వైకాపా మహిళా కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనలో ఎటువంటి విధ్వంసమూ జరగపోవడంతో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. దీనిపై తెదేపా నేతలకు వివరించినపుడు వారు కూడా తమతో ఏకీభవించారని తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఆందోళనలు అరికట్టే విధంగా చర్యలు ఉంటాయని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: