ETV Bharat / city

PROTEST : 'ఆస్తి పన్నుకు.. మళ్లీ ఇంటి ప్లాన్​తో పనేంటి'

author img

By

Published : Nov 20, 2021, 7:32 PM IST

కొత్త ఆస్తి పన్ను నిర్ణయించేందుకు.. ఇళ్ల ప్లాన్లు అడగటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ నగరంలోని "విశాఖపట్నం అపార్ట్​మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్" సభ్యులు సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని ఖండించారు.

విశాఖపట్నం అపార్ట్​మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం

ఇంటి ప్లాన్లు ఇవ్వాలని సచివాలయ వాలంటీర్ల ద్వారా ఫోన్లు చేయించి హెచ్చరించడం అన్యాయమని విశాఖపట్నం అపార్ట్​మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీజీ గణేశ్ అన్నారు. విశాఖ వార్వ కార్యాలయంలో 'నివాస్' సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నగరంలోని ప్రతి ఇంటి ప్లాన్​ను నగరపాలక సంస్థ వద్ద ఉంచుకొని, ఇప్పుడు మళ్లీ ప్లాను ఇవ్వాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పాత ఇళ్లకు పాత పన్నును లెక్క కట్టేందుకు ఇంటి ప్లాన్​తో అవసరమేమిటని నిలదీశారు.

ఇదీచదవండి.

BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.