ETV Bharat / city

వ్యర్థాలతో అద్భుతాలు.. వైవిధ్యమైన రూపాలకు ప్రాణం

author img

By

Published : Nov 9, 2019, 7:02 AM IST

Updated : Nov 9, 2019, 7:31 AM IST

మనసు పెడితే.. వ్యర్థాలను సైతం అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిందా మహిళ. ఇంట్లో పనికిరాని వస్తువులను.. కళాఖండాలుగా మారుస్తూ.. ఔరా అనిపిస్తోంది. తనకు వచ్చిన చిత్రలేఖనాన్ని నలుగురికీ ఉచితంగా నేర్పుతూ.. ఆదర్శంగా నిలుస్తోంది.

arts
వ్యర్థాలతో అద్భుత వస్తువులు రూపొందిస్తున్న శిరీష

చూసేందుకు అబ్బురంగా కనిపిస్తున్న ఈ చిత్రాలు.. ఎందుకూ పనికిరాని వ్యర్థాలతో రూపొందించినవి. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన శిరీష.. వీటికి ప్రాణం పోశారు. ఉడకపెట్టాక పడేసిన కోడిగుడ్డు పెంకులు, పాత సీడీలు, కర్రపుల్లల సాయంతో వస్తువులు తయారు చేస్తున్నారు.

చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న శిరీష...సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే వస్తువులు తయారు చేస్తున్నారు. ముందుగా ఓ కాగితంపై వాటిని గీసి... రూపు తీసుకొస్తారు. తర్వాత వాటికి వ్యర్ధాలను కావాల్సిన విధంగా అంటించి... రంగులు నింపుతారు. భర్త కూడా చిత్రకారుడు కావటంతో శిరీషకు పూర్తి ప్రోత్సాహం అందించారు. కేవలం చిత్రాలు గీయడమే కాకుండా తమకంటూ ప్రత్యేక ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఆలోచనతోనూ...వైవిధ్య వస్తువులు తయారు చేస్తున్నారు. ఈమె కృషిని గుర్తించిన పలు సంస్థలు... పురస్కారాలను సైతం అందించాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్ధాలతో అపురూప చిత్రాలను తయారు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు శిరీష. భవిష్యత్‌లో కపుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు... భర్తతో కలిసి ప్రతి ఆదివారం చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు

Intro:Ap_vsp_46_08_vyardhalato_apurupa_chitralu_youvati_pratibha_Pkg_Ab_AP10077_k.Bhanojirao_8008574722
కోడిగుడ్డు ఉడక పెట్టాక వాటి పెంకులను తీసేసి చెత్తబుట్టలో పడేస్తాం. అలాంటి పెంకులతో అపురూప చిత్రాలను మలచవచ్చని విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన యువతి నిరూపించింది. చిన్నప్పుడు నుంచి చిత్రలేఖనం పై ఉండే ఆసక్తికి సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే చిత్రాలను గీచి వాటికి వ్యర్ధాలను జోడించి ఔరా అనిపిస్తుంది. ఈ యువతి. అనకాపల్లికి చెందిన వరద శిరీష ఇంజనీరింగ్ పూర్తి చేసింది. భర్త తారక కృష్ణ సూర్య ప్రకాష్ స్వతహాగా చిత్రకారుడు కావడంతో ఈమెకు ప్రోత్సాహాన్ని అందించారు.
కేవలం చిత్రాలు గీయడమే కాకుండా మనకంటూ ప్రత్యేక ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ఆలోచనకు పదును పెట్టారు.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి వీధినా
నూడిల్స్ షాపులు వేస్తున్నాయి వీటిలో అధికంగా వాడే కోడిగుడ్లు పెంకులను దుకాణ నిర్వాహకులు పడేస్తున్నారు.
వీటిని సేకరించి ఈ పెంకులతో చిత్రాలను మలిస్తే అని వచ్చిన ఆలోచనకు పదును పెట్టింది శిరీష.

Body:శ్రమతో కూడుకున్నదే అయినప్పటికీ కోడుగుడ్డు పెంకులను అందంగా మలచి చిత్రాలకు అద్ది పలువురి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో బహుమతులు సాధించారు వాడిసేన దారపు రీలు తో ఫ్లవర్ వాజులు, గ్లాస్ పెంటింగ్ తయారీలో ప్రతిభ
చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్ధాలతో అపురూప చిత్రాలను తయారు చేస్తూ
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారా త్వరలోనే కపుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాలన్న తన కోరికని శిరీష వెల్లడించారు.
తన భర్తతో కలిసి ప్రతి ఆదివారం చిత్రలేఖనం పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.

Conclusion:బైట్1 వరద శిరీష, చిత్ర కారిణి, అనకాపల్లి
Last Updated : Nov 9, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.