ETV Bharat / city

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు ఎప్పుడు..? - విశాఖ జోన్ ఏర్పాటు వార్తలు

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా.. అధికారుల్లో స్పందన లేదు. ఇప్పటివరకు ఉన్న ఓఎస్డీ దక్షిణ రైల్వేకి బదిలీ కావడం ఈ పోస్టులో ఎవరినీ నియమించకపోవడం వల్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైల్వే జోన్​ కలలానే మిగిలిపోతుందా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు ఎప్పుడు..?
విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు ఎప్పుడు..?
author img

By

Published : Jun 10, 2020, 9:15 PM IST

విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్​కి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం ప్రభుత్వం ప్రకటన చేసి ఇప్పటికి 15 నెలలు అవుతోంది. అయితే ఇప్పటికీ కనీసం ప్రారంభ పనులు కార్యరూపం దాల్చలేదు. తొలి ఓఎస్డీగా శ్రీనివాస్​ నియమితులైన తర్వాత ఓ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఆయన్ని బదిలీ చేసి ధనుంజయులను ఓఎస్డీగా నియమించారు. ఆయన్ను కూడా రెండ్రోజుల క్రితమే దక్షిణ రైల్వేకి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ పోస్టులోకి ఎవరినీ నియమించకపోవడం జోన్​ ఏర్పాటు ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆశలు నెరవేరేనా..?

విశాఖ రైల్వే జోన్​ పదకొండు నెలల్లోనే అందుబాటులోకి వస్తుందన్న అప్పటి రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటన ఎప్పటికి కార్యరూపంలోకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. కొత్త జోన్​ ఏర్పాటైతే.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఈ ప్రాంత వాసులు భావించారు. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ గడచిన ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని సాధించి దేశంలోనే అత్యధిక ఆదాయమున్న డివిజన్ల తొలివరుసలో నిలిచింది. ఈ డివిజన్​ను ముక్కలు చేసి రాయగడ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ డివిజన్ మనుగడ కొనసాగించాలన్న డిమాండ్ గట్టిగా కేంద్రం ముందుంది.

ఆగస్టులోనే నివేదిక

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటు కోసం డీపీఆర్​ నివేదిక 2019 ఆగస్టులోనే కేంద్రానికి చేరింది. అయితే ఈసారి బడ్జెట్​లో రాయగడ డివిజన్​తో కలిపి కేవలం రూ.3 కోట్లు మాత్రమే కేటాయింపు చూపారు. కరోనా సంక్షోభం నుంచి జోన్​కు సంబంధించి ఎలాంటి కదలిక లేదు.

అనుమానమే..!

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3,496 కిలోమీటర్లతో నిర్ణయం కావాల్సి ఉంది. గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి పూర్తిగా రావాలి. వాల్తేర్ డివిజన్ అరకు వరకు మాత్రమే ఈ జోన్ పరిధిలోకి వచ్చి విజయవాడ డివిజన్​లో భాగం అవుతుందని రైల్వే అధికారులు ప్రతిపాదించారు. విశాఖ కేంద్రంగా వాల్తేర్ సబ్ డివిజన్ ఉండే అవకాశం కూడా ఉంది. తాజాగా ఓఎస్డీ బదిలీతో జోన్​ ఏర్పాటు మరింత సందిగ్ధంలో పడింది. కరోనాతో నష్టపోయిన రైల్వే.. అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశగా అలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు జోన్ ఏర్పాటు ఎంతవరకు సాధ్యపడుతుందన్నది సందేహంగా మారింది.

ఇదీ చూడండి..

బుల్లెట్ నడుపుతున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.