విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని పలు క్వారీల్లో గనుల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు 15 రోజులపాటు చేపడుతున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ ఏడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
ఎంత మేర లీజుకు తీసుకున్నారు.. ఎంతమేర తవ్వకాలు చేపట్టారు.. తదితర విషయాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలకు వర్షం అడ్డంకిగా మారింది.
ఇదీ చదవండి: మన్యంలో అక్రమ మైనింగ్‌కు ప్రభుత్వం సహకరిస్తోంది