ETV Bharat / city

TWO DIED IN ROAD ACCIDENT: డివైడర్​ను ఢీకొన్న ప్రమాదంలో.. ఇద్దరు దుర్మరణం

ACCIDENT ON TELUGU TALLI FLYOVER: విశాఖ నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్​ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

VIZAG LATEST NEWS
TWO DIED IN ROAD ACCIDENT
author img

By

Published : Dec 8, 2021, 12:30 AM IST

TWO DIED IN ROAD ACCIDENT AT VISAKHAPATNAM: విశాఖ నగరంలోని తెలుగు తల్లి పైవంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, తీవ్ర గాయాలపాలైన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. మృతులు విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), మురళినగర్ ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న యువతి(17)గా గుర్తించారు.

వీరు మంగళవారం సాయంత్రం ఆశీల్ మెట్ట నుండి కంచరపాలెం వైపు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో.. తెలుగు తల్లి పైవంతెన పైన వెళ్తూ వేగంగా రోడ్డు పక్కన డివైడర్​ను బలంగా ఢీకొని ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు యువతి కొద్దిసేపటి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి రెండవ పట్టణ పోలీసులు చేరుకొని పరిశీలించి.. ప్రాథమిక విచారణ చేపట్టారు.

ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన ప్రశాంత్ రైల్వే న్యూ కాలనీలో నివసిస్తూ సీతమ్మధారలోని ఫ్యాషన్ వైబ్స్​లో పనిచేస్తున్నాడని, యువతి నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

hetero wastewater pipeline: హెటిరో వ్యర్థ జలాల పైప్​ లైన్ నిర్మాణంపై మత్స్యకారుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.