విశాఖలో ఆదివారం నేవీ మారథాన్ సందర్భంగా... ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి చేపలుప్పాడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. సాగరతీరం వెంబడి వాహనాలకు అనుమతి లేదని విశాఖ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భీమిలి నుంచి విశాఖ వచ్చే బస్సులు జాతీయ రహదారిపైకి మళ్లించనున్నారు. బీచ్ రోడ్‌లో ఎక్కడికక్కడ అవసరానికి అనుగుణంగా వాహనాల మళ్లింపు చేయనున్నారు. కోస్టల్ బ్యాటరీ, ఫిషింగ్ హార్బర్ రోడ్, ఏపీఐఐసీ మైదానంలో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. గోకుల్ పార్క్, ఏయూ హైస్కూల్ మైదానంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ... 'రెవెన్యూ లోటుపై కేంద్రాన్ని గట్టిగా అడగండి'