ETV Bharat / city

దస్తావేజులు మెండుగా... ఆదాయం దండిగా..! - విశాఖ వార్తలు

కొవిడ్ కారణంగా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో... ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ క్రమేణా జోరందుకుంది. విశాఖజిల్లాలో 80శాతం కార్యాలయాలు సెప్టెంబర్​లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాయి.

the-process-of-registrations-in-ap-is-gradually-increasing
జోరందుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ
author img

By

Published : Oct 3, 2020, 2:13 PM IST

విశాఖ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బాగా పుంజుకుంటోంది. దాదాపు 80 శాతం కార్యాలయాల్లో సెప్టెంబరు లక్ష్యాన్ని సాధించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదైన వివరాలను పరిశీలించి చూస్తే.. జిల్లా కాస్త వెనుకబడిందని చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్ కారణంగా కార్యాలయాలు పనిచేయకపోవటమే ఇందుకు కారణంగా భావించారు. ఆ తర్వాత అంతా సర్దుకున్న సర్వర్ డౌన్ కావడం, డాక్యుమెంట్లు అప్​లోడ్ సరిగా కాకపోవటం వంటి కారణాల కారణంగా రిజిస్ట్రేషన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.

జిల్లాలో పరిస్థితి..

సెప్టెంబర్ నెలకు సంబంధించి విశాఖ జిల్లాకు గాను రూ. 60 కోట్లకు పైగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే... అందులో 88.43 శాతంతో 53.14 కోట్లు సాధించారు. జిల్లాలో ఎనిమిది కార్యాలయాలు ఉండగా.. మధురవాడ 115.21, భీమిలి 104.89, పెందుర్తి 101.81 శాతం ఆదాయం సాధించాయి. గోపాలపట్నం 92.2, గాజువాక 91.2 శాతం చొప్పున లక్ష్యాన్ని చేరుకున్నాయి. అలాగే సూపర్ బజార్ 79. 64, ఆనందపురం 71.13 శాతం చొప్పున సాధించాయి. ద్వారకా నగర్ కార్యాలయానికి సంబంధించి 66% తో కాస్త వెనుకబడింది.

అనకాపల్లి పరిధిలో 11 కార్యాలయం ఉండగా... సెప్టెంబరు నెల లక్ష్యానికి మించి ఆదాయాన్ని సంపాదించాయి. ఇందులో ఎలమంచిలి కార్యాలయానికి గానూ 177.71 శాతం ఉండగా, ఆ తర్వాత మాడుగుల కార్యాలయానికి సంబంధించి 147.21% తో నమోదయ్యాయి. నక్కపల్లి 138.89, చోడవరం 125. 79, పెదగంట్యాడ 118. 25, సబ్బవరం 129. 17 , లంకెలపాలెం 99. 43, అనకాపల్లి 97.3 శాతం సాధించాయి. నర్సీపట్నంలో మాత్రం 34. 76 శాతంలో ఉండిపోయింది. విశాఖ జిల్లాకు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన లక్ష్యం 392.65 కోట్లు కాగా... 58.35 శాతంతో 229. 13 కోట్లు సాధించింది. అనకాపల్లికి సంబంధించి ఆరు నెలలకుగాను... ఇచ్చిన లక్ష్యం 147. 33 కోట్లు కాగా, అందులో 69.91 శాతం అంటే 103 కోట్లు ఇప్పటికే రాబట్టారు.

ఆదాయం అక్కడి కార్యాలయాలకు తరలిపోతుంది...

రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఎనీవేర్ రిజిస్ట్రేషన్​లకు అనుమతించేది. అంటే ఒక రిజిస్టార్ కార్యాలయం పరిధిలో ఆస్తి ఉంటే జిల్లాలో ఏ రిజిస్టర్ కార్యాలయాలు అయినా దాన్ని లావాదేవీలు చేసుకునే విధంగా వీలు కల్పించింది. అయితే ఇటీవల కాలంలో జిల్లాల పరిమితులు తీసేసి రాష్ట్రంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకుని సౌలభ్యం కల్పించింది. దీంతో విశాఖపట్నం జిల్లాలో స్థిరాస్తి ఉంటున్నవారు ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఇక్కడికి రాకుండా వారి జిల్లాలోనే ఎనీవేర్ కింద రిజిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు. దీంతో ఇక్కడి కార్యాలయానికి రావలసిన ఆదాయం ఆయా కార్యాలయాలకు వెళ్లిపోతుంది. ఇలా ఆరు నెలల కాలంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారు 1,500 రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాల్లో జరిగినట్లు తేలింది దీనివల్ల జిల్లాకు రావాల్సిన ఆదాయం చేజారి పోయింది.

ఇదీ చదవండి: గ్రామ పంచాయతీల్లో వెలుగుచూస్తున్న కార్యదర్శుల అవినీతి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.