ETV Bharat / city

ప్రకృతి వైద్యం.. ఎలాంటి మందులు లేకుండా దీర్ఘకాలిక సమస్యలకు చెక్

Nature Cure: సమస్త జీవనానికి మూలం ప్రకృతి. అక్కడి నుంచి ఉద్భవించిందే మానవ జీవనం. కాలక్రమేణా.. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్ల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొంతవరకు ఆధునిక వైద్యం అరికట్టినా.. ప్రకృతికి వాటిని ఎలా నివారించాలో తెలుసు. ఈ విధానాన్నే పాటిస్తోంది విశాఖలోని నేచర్ క్యూర్ ట్రస్ట్. మరి ఆ ప్రకృతి వైద్య విధానాలేంటో తెలుసుకుందామా.

naturopathy
naturopathy
author img

By

Published : Jun 21, 2022, 5:37 PM IST

దీర్ఘకాలిక సమస్యలకు... ప్రకృతి వైద్యం ద్వారా చెక్‌... అది కూడా ఎటువంటి మందులు లేకుండా..

విశాఖ సాగర తీరాన దశాబ్దాలుగా సేవలందిస్తోంది ప్రకృతి చికిత్సాలయం. 1916 ప్రాంతంలో ప్రముఖ ప్రకృతి వైద్యులుగా పేరు పొందిన ఎస్.దక్షిణామూర్తి.. ఈ చికిత్సాలయానికి నాంది పలికారు. నేచర్ క్యూర్ ట్రస్ట్ పేరిట 1965లో ప్రకృతి చికిత్సాలయం రూపుదిద్దుకుంది. క్రమంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తోడు కావడంతో.. పేద రోగులకు సైతం చికిత్స అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం వారి తనయులు లక్ష్మీనారాయణ దంపతులు దీనిని నిర్వహిస్తున్నారు.

ఈ ప్రకృతి చికిత్సాలయంలో ఎటువంటి మందులు ఇవ్వరు. రోగి సమస్యకు మూలకారణం తెలుసుకుని... ప్రకృతి చికిత్సను అందిస్తారు. సమస్య తీవ్రతను బట్టి.. కనీసం 7 నుంచి నెల రోజుల వరకు ఇక్కడే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుంది. రోగి శరీర తత్త్వానికి అనుగుణంగా ఏ చికిత్స అందించాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రధానంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, వంటి వాటితో పాటు.. బీపీ, షుగర్‌లు కూడా ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజేస్తారు. ఇందులో భాగంగానే మృత్తికా స్నానం, ఆవిరి స్నానం, హైడ్రోథెరపీ, వాయు చికిత్స వంటివి ఇస్తారు. యోగా కూడా ఈ చికిత్సలో చాలా ముఖ్యం. ఉప్పునీటి వైద్యం, ఇసుక వైద్యం, సాలిగ్రామ వైద్యం కూడా ఇందులో వినియోగిస్తారు. వీటివల్ల తమ నొప్పులకు ఎంతో ఉపశమనం లభించిందని వైద్యం పొందుతున్నవారు చెబుతున్నారు.

ఊబకాయం ఆధునిక కాలంలో ఒక ప్రధాన సమస్యగా ఉంటోంది. దీనికి పరిష్కారంగా ప్రకృతి చికిత్సలో వివిధ అంశాలను వారి చేత అభ్యాసం చేయిస్తున్నారు. పక్షవాతం, కీళ్ల నొప్పులతో వచ్చే వారికి.. మంచి ఉపశమనం లభించిందని... చికిత్స పొందుతున్న వారు అంటున్నారు. ఇటీవలి కాలంలో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాప్ట్‌వేర్ ఉద్యోగులు కూడా వస్తున్నారని వైద్యులంటున్నారు.

ప్రకృతి చికిత్స వైద్య విధానాల ద్వారా... దీర్ఘకాలిక ఉపశమనం లభించడంతో పాటు... ప్రకృతి గొప్పదనం తెలిసి వస్తుందని ఇక్కడి వైద్యులంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.