విశాఖ మన్యం పాడేరు ఏజెన్సీలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. హుకుంపేట మండలం జర్రకొండ వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. జర్రకొండ పంచాయతీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆమూరు వెళ్లే రహదారి వరద ఉద్ధృతికి మునిగిపోయింది. అవతలి వైపు వెళ్ళడానికి రాకపోకలు స్తంభించాయి.
నేలకొరిగిన భారీ వృక్షం
కుండపోత వర్షాలకు విశాఖ ముడసరలోవలో భారీ వృక్షం నేలకొరిగింది.. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న మర్రిచెట్టు కూకటివేళ్ళతో సహా లేచిపోయి పడిపోయింది. ఈ ప్రాంతంలో ఈ మర్రిచెట్టు చాలా ప్రాచుర్యం పొందింది. రహదారిపై చెట్టు కొమ్మలను తొలగించే పనిని అధికారులు చేపట్టారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక