విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గల రైవాడ జలాశయం అందాలు పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పచ్చని అందాల నడుమ వరద నీటి అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్ఖాయికి చేరుకోవటంతో....అధికారులు గేట్లు ఎత్తి దిగువన ఉన్న శారదానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎటు చూసినా నీటితో నిండుగా కనిపిస్తున్న రైవాడ జలాశయం... చూపరులను ఆకర్షిస్తూ...ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసు దోచుకుంటోంది. ఈ అద్భుత అందాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: బెజవాడ.. జల సోయగాలను ఆస్వాదిస్తున్న సందర్శకులు