వైకాపా - తెదేపా శ్రేణుల మధ్య జరుగుతున్న దాడులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెదేపాకు చెందిన వారు ఇంకా అధికారంలో ఉన్నట్లు భావించటం వల్లే దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యనించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పతున్నందునే వైకాపా కార్యకర్తలు స్పందిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను దాడులకు దూరంగా ఉండాలని సూచించామని చెప్పారు.
ఇదీ చదవండి