రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత లేదని తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైకాపా వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని విమర్శంచారు. విశాఖను రాజధాని అని చెప్తున్న ప్రభుత్వం.. నగరానికి కనీసం మంత్రిలేకుండా చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని వైకాపా ప్రభుత్వం చెప్పుకుంటుందని.. కానీ వారికి మేలు చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
జిల్లా విభజన కూడా సరిగా జరగలేదన్నారు. జిల్లా విభజన సమయంలో సీఎం తీరుతో సొంతపార్టీ నాయకులే చెప్పులతో కొట్టుకున్నారని గుర్తు చేశారు. కొత్త కెబినేట్ ఏర్పాటుతో వైకాపాలోను విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్ తనని తాను బలమైన నాయకుడిగా చూపించుకున్నారని.. కానీ తాజా పరిస్థితులతో బలహీనమైన నాయకుడని నిరూపణ అయిందన్నారు.
ఇదీ చదవండి: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తాం: మంత్రులు