ETV Bharat / city

సంక్షేమం పేరుతో ప్రభుత్వం దగా.. తెదేపా 'ప్రజా ఛార్జిషీటు' పుస్తకం - విశాఖలో ప్రజా ఛార్జిషీటు పేరుతో పుస్తకం విడుదల చేసిన తెదేపా

సంక్షేమం పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ మూడేళ్ల పాలనలో దోపిడీలు, భారాలు, విధ్వంసాలు, సామాజిక విద్రోహాలు జరిగాయంటూ సోమవారం విశాఖలోని తెదేపా కార్యాలయంలో 'ప్రజా ఛార్జిషీటు'ను పుస్తక రూపంలో విడుదల చేశారు. ఇందులో 1,111 అంశాలను పొందుపరిచారు.

praja Chargesheet
ప్రజా ఛార్జిషీటు
author img

By

Published : May 31, 2022, 7:14 AM IST

'ప్రజా ఛార్జిషీటు' లోని అంశాల్లో ఒక్కో రోజు ఒక్కో అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని వెల్లడించారు. తెదేపాకు 160 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘సామాజిక న్యాయం అంటున్న మంత్రులు నోరులేని మూగజీవులు. రాష్ట్రాన్ని కేవలం విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏలుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నలుగురి చేతిలో పగ్గాలు పెట్టారు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయన ఏమన్నారంటే..

* ‘మూడేళ్ల వైకాపా పాలనలో జగన్‌ సొంత పత్రికలో పనిచేసిన వారిని సలహాదారులుగా, పీఆర్వోలుగా నియమించుకొని ప్రజల సొమ్మును ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలైనప్పటికీ కొత్తవని చెబుతూ ప్రచారానికి సాక్షి పత్రికకు కోట్లు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

* గత ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులను ఆపేసి రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అప్పటివరకు పనిచేసిన గుత్తేదారులను తొలగించారు. సొంత మనుషులను పెట్టుకొని ఈ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సర్వనాశనం చేశారు.

* 2014-19 మధ్యలో సన్‌రైజ్‌ రాష్ట్రంగా ఏపీ కొనసాగింది. పోలవరం, అమరావతి పనులు నిరంతరాయంగా సాగాయి. విశాఖ ఐటీ హబ్‌గా కళకళలాడింది. అలాంటి నగరాన్ని విధ్వంస విశాఖగా మార్చేసిన ఘనుడు జగన్‌. ఒక్క పరిశ్రమనైనా విశాఖకు తీసుకురాలేదు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్‌ను రద్దు చేసి దావోస్‌లో మళ్లీ అదే సెంటర్‌ కోసం ఒప్పందం చేసుకున్నారు. అదానీని కలిసేందుకు దిల్లీ వెళితే సరిపోతుంది కదా. ఇటీవల కర్నూలులో ప్రారంభించిన గ్రీన్‌కో ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయించాం. దీని పనులను ఇటీవల జగన్‌ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు వారిని దావోస్‌కు పిలిపించి ఒప్పందం చేసుకున్నట్లు మళ్లీ చూపించడం ఎంత దారుణం?

* ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ కూడా అన్ని అవసరాలు తీర్చాలంటే ఎలా? అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. అసలు ఆయన మంత్రేనా? ఖాతాల్లో డబ్బులు వేయాలంటే ప్రభుత్వమే అవసరం లేదు. అది ఎవరైనా చేస్తారు? ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే వేసిన డబ్బులను ఖర్చు పెట్టుకుంటారు. ఇలాంటి నాయకులు సామాజిక న్యాయభేరి యాత్ర అని బయలుదేరడం దురదృష్టకరం.

* విద్యుత్తు ఛార్జీలు మూడేళ్లలో 5సార్లు పెంచి ప్రజలపై రూ.46,000 కోట్ల భారం మోపారు. ఇటీవల కేంద్రం పెట్రో ధరలు తగ్గించినా రాష్ట్రం పైసా తగ్గించలేదు. దేశంలో ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై చెత్తపన్ను సైతం వేశారు. దీనికితోడు కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, రాయితీ రుణాల్లో అన్నీ మోసాలే’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

విద్వేషం.. విధ్వంసం... విషాదం: "సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లలో సాధించింది శూన్యం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అవడం ఖాయం. జగన్‌ మూడేళ్ల పాలనను 3 ముక్కల్లో చెప్పాలంటే విద్వేషం.. విధ్వంసం.. విషాదమే. జగన్‌ అసలు దావోస్‌ ఎందుకు వెళ్లారో... రాష్ట్రానికి ఏం తెచ్చారో ఎవరికీ తెలీదు. ఆయన వాడిన ప్రత్యేక విమానంతో రాష్ట్రానికి అదనపు భారం మినహా పైసా లాభం లేదు"- ట్విటర్‌లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఇదో రియల్‌ క్రైం స్టోరీ: "రాష్ట్రంలో జగన్‌ సాగించిన మూడేళ్ల పాలన రియల్‌ క్రైం స్టోరీని తలపిస్తోంది. తప్పుడు కేసులు, కల్తీ మద్యం అమ్మకాలు, ఇసుక స్వాహా, విద్యుత్తు కోతలు, విమర్శిస్తే అరెస్టులు, ఉద్యోగుల గొంతు కోతలు, రైతుల కడుపు మంట, పోలవరానికి పాతర, అధ్వాన రహదారులు, కాలకేయులను తలపించే ఎమ్మెల్యేలు.. ఇలా ఎన్ని గొప్పలో ఉన్నాయి"- ట్విటర్‌లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.