విశాఖలో డి.వి సుబ్బారావు స్మారకోపన్యాసంలో ఆర్టికల్ 21 దృక్పథం, విస్తరణ అనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామ సుబ్రమణియన్ ప్రసంగించారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు హాజరయ్యారు. ఆర్టికల్ 21 సంబంధించి ఇంగ్లండ్‌లో ఉన్న న్యాయనిబంధనలను జస్టిస్ సుబ్రమణియన్ ఉటంకించారు. పలు కొత్తతరహా అంశాలు న్యాయస్థానాలకు వస్తున్నాయని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం, వైద్య రంగంలో వస్తోన్న మార్పులపై న్యాయ నిపుణులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెబుతున్నాయన్నారు. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతి కోసం ఈ మధ్య న్యాయస్థానాలకు వస్తున్నారని గుర్తు చేశారు. ఆర్టికల్ 21 పరిధి విస్తరణలో ఇవన్నీ కొత్త కోణాలని తెలిపారు.
'ఆర్టికల్ 21 పరిధి విస్తరణతో... కొత్త తరహా సవాళ్లు'
రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 పరిధి పెరిగిందని, ఈ విషయంలో న్యాయస్థానాలు కొత్త తరహా సవాళ్లు ఎదుర్కొంటున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ సుబ్రమణియన్ చెప్పారు. విశాఖలో నిర్వహించిన డీవీ సుబ్బారావు స్మారకోపన్యాసానికి ఆయన హాజరయ్యారు.