విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్జీటీలో కేసు విచారణ నవంబర్ 3న ఉందని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఎన్జీటీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌ను సుప్రీం ఆదేశించింది. 10 రోజుల్లో నివేదికపై అభ్యంతరాలను ఎన్జీటీతో పాటు సుప్రీంకు సమర్పించాలని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు ఎన్జీటీలో కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి..