భారత్ - అఫ్గానిస్థాన్ మధ్య సాంఘిక, ఆర్థిక, వాణిజ్య బంధాలకు ప్రతీకగా ఎంతో మంది విద్యార్థులు దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీరు పూర్తిగా భారత ప్రభుత్వ ఉపకార వేతనాలతోనే చదువు కొనసాగిస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు పెద్దఎత్తున ఆశ్రయమిస్తోంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు వివిధ కోర్సులు పూర్తిచేసుకుని స్వదేశానికి వెళ్తుంటారు. ఇక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో సుమారు 130 మంది అఫ్ఘానిస్తాన్ వాళ్లే ఉన్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో పరిణామాలపై వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్గాన్‌లో శాంతి ఏర్పడి ప్రజా సంక్షేమం దిశగా పయనిస్తున్న పరిస్ధితుల్లో తాలిబన్లు తిరిగి అధికారంలోనికి వస్తే ప్రజా సంక్షేమమే కాకుండా వారి మనుగడ కూడా ప్రశ్నార్థకం అయిపోతుందేమోనన్న భయం విద్యార్థుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాము ప్రజలను హింసించమని చెబుతున్నప్పటికీ.., గతంలో వారి పాలనలో ప్రజలు అనుభవించిన నరక యాతనలను గుర్తు చేసుకొని దిగులు చెందుతున్నారు. విదేశీ జోక్యంతో తాలిబన్లతో శాంతి చర్చలు జరగాలని అప్గాన్ , నైజీరియా, నేపాల్ విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి