ETV Bharat / city

వెల్లివిరిసిన మానవత్వం.. కరోనా కాలంలో దాతల సేవాపథం! - కొవిడ్​ బాధితులకు సహయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ సాయం కోసం నిరీక్షించకుండా స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్​, వైద్యపరికరాలతో పాటు.. బాధితులకు ఆహరాన్ని అందిస్తూ ఆదుకుంటున్నారు.

help to covid
కొవిడ్ బాధితులకు సాయం
author img

By

Published : Jun 17, 2021, 9:47 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో..

అనపర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పలువురు దాతలు, పారిశ్రామికవేత్తలు అందించిన 50లక్షల రూపాయలతో.. కొవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్​ను ప్రారంభించారు. వీటిని ఎంపీ మార్గాని భరత్​, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి 34 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని ఎంపీ భరత్ పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాలో..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హింద్ జమాతే ఇస్లామీ అనే ఆధ్వర్యంలో 45వ రోజు కొవిడ్​ రోగుల బంధువులకు, పారిశుధ్య సిబ్బంది, నర్సులకు భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కష్టాలలో ఉన్న పేద ప్రజలకు ఖూరాన్ లో చెప్పిన విధంగా తమ సంస్ధ తరుపున కులమాతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు జరుపుతున్నామని ఆ సంస్థ జాతీయ నాయకులు అబ్ధుల్ సుభాన్ తెలిపారు. తాము చేస్తున్న కార్యక్రమాలకి సహకరించిన తోటి స్నేహితులకి, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు జిల్లాలో..

కరోనా కారణంగా జిల్లాలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులు అందజేశారు. 300 మందికి పైగా ఉపాధ్యాయులకు ఇవాళ సరుకులు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా ఇలాంటి వారిని గుర్తించి సాయం అందజేస్తామన్నారు. కొవిడ్​ కష్ట సమయంలో రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. దాతల సాయంతో ఇలా విభిన్న వర్గాల వారికి సాయం చేస్తున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రరాజు తెలిపారు.

కర్నూలు జిల్లాలో..

అన్ని దానాల కన్నా.. అన్నదానం మిన్న అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో యుపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేడు ఎమ్మెల్యే పాల్గొని రోగుల సహయకులకు ఆయన అన్నదానం చేశారు. కరోనా సమయంలో ప్రతి రోజు 14 వందల మందికి ఆసుపత్రిలో అన్నదానం చెయ్యడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జీవీఎంసీ 16వ వార్డు హెచ్​బి కాలనీలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్​లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్, సిబ్బందికి మూవింగ్ మైండ్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫేస్ ఫీల్డ్​లు, హ్యాండ్ గ్లౌజ్లులు, N95 మాస్క్​లు పంపిణీ చేశారు. కరోనా లాంటి ప్రమాదకర ఈ పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ గా విధులు నిర్వహించడం గొప్ప త్యాగం అని ఫౌండేషన్ ప్రతినిధి జే.వి.పృథ్వి అన్నారు. వారి సేవా భావానికి అభినందనలు తెలియజేశారు. జీవీఎంసీలో మెడికల్, ఇతర ఫ్రంట్లైన్ వారియర్స్​కు మా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎంప్లాయిస్​ యూనియన్​, ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ, తెదేపా 16వ వార్డు నాయకులు పాల్గొన్నారు.

విశాఖలోని వివేకానంద సంస్థ.. 45 రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిత్యం 300 మందికి చొప్పున ఇప్పటివరకూ 3,500 మందికి భోజనం ప్యాకెట్లు అందజేసినట్టు తెలిపింది. పేదలు కరోనా బారిన పడకుండా రక్షించేందుకు కోడి మాంసం, కోడిగుడ్లు, రెండు రకాల కూరలు, పప్పు, మజ్జిగ, పండ్లతో కూడిన పౌష్టికాహారం అందజేస్తున్నామని వివరించింది. ఈనెల 30 వరకు సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:

Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.