ETV Bharat / city

'రాజీనామా చేశారు... తర్వాత ఏంటీ..?'

సీబీఐ పూర్వపు జేడీ(జాయింట్ డైరెక్టర్) వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకీ రాజీనామా చేయడం... రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు రాజీనామా చేశారు..? పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా..? ఇప్పుడు లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు..? ఆయనే సొంతంగా పార్టీ పెడతారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. లక్ష్మీనారాయణ భవిష్యత్తు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

story about laxminarayana
వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా
author img

By

Published : Jan 30, 2020, 11:31 PM IST

వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా

లక్ష్మీనారాయణ 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పలుచోట్ల పర్యటించారు. సొంత పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. 2018 నవంబర్​లో ఆయనను లోక్​సత్తా పార్టీలో చేరాలని జయప్రకాశ్ నారాయణ ఆహ్వానించారు. 2019 ఎన్నికల ముందు ఆయన జనసేనలో చేరారు. విశాఖ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 23.30 శాతంతో 2,88,874 ఓట్లు సాధించారు.

లక్ష్మీనారాయణ పార్టీ వీడటానికి అనేక కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ పేరుతో... 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సందర్భంగా అధికార వికేంద్రీకరణను లక్ష్మీనారాయణ సమర్ధించారు. జనసేన మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోబోమని జనసేన హెచ్చరిస్తోంది. ఈ సందర్భంలో ఆయన జనసేన నుంచి బయటకు వస్తారనే ప్రచారం జరిగింది.

భాజపాలో విశాఖ సీటు మీద చాలామంది ఆశలు పెట్టుకున్నవారు ఉన్నారు. 2014లో విశాఖ నుంచి భాజపా తరఫున హరిబాబు గెలిచారు. అంతకు ముందు కాంగ్రెస్ తరఫున పురంధేశ్వరి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె భాజపాలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ చేశారు. రాజకీయ పరిణామాలు మారి... జనసేన-భాజపా మధ్య పొత్తు పొడిచింది.

2024 ఎన్నికల్లో విశాఖ సీటు జనసేనకే వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ కష్టపడి పనిచేసి కేడర్‌ను పెంచుకున్నా... చివరకు పొత్తుల పేరు చెప్పి విశాఖ సీటు భాజపా తీసుకుంటే అప్పుడు లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి...? అప్పటికప్పుడు మరో సీటు ఇస్తామంటే సీన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ సమీకరణాలు ఆలోచించిన తర్వాతే... లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారనే చర్చ జరుగుతోంది. లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..!

ఇదీ చదవండీ... లక్ష్మీనారాయణ అలా ఆలోచించి ఉంటే బాగుండేది: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.