ETV Bharat / city

కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు - వైజాక్​ వార్తలు

విశాఖ ఉద్యమాన్ని రోజురోజుకూ ఉద్ధృతం చేసేవిధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఉద్యమ నేతలు చెబుతున్నారు. ఈ నెలలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు.

vizag steel plant agitations
కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు
author img

By

Published : Apr 2, 2021, 10:31 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, నిర్వాసితులు ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తైతే.. ఇకపై జరగబోయేది మరోఎత్తని ఉద్యమ నేతలు అంటున్నారు. ఈ నెలలో మరిన్ని కీలక కార్యక్రమాలు జరుగుతాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

కూర్మన్నపాలెంలో నిరసన జరుపుతూనే.. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర రిలే నిరహార దీక్షలు మొదలు పెడుతామన్నారు. అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నేతృత్వంలో ఈ నిరసన దీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 4న సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో బీచ్​లో పరుగు.. 18న కార్మిక కర్షకులతో మహా సభ నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి: 'ఎవరి పర్యవేక్షణలో సరుకు విక్రయిస్తే బాగుంటుందో చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.