ప్రశాంత్.. నాలుగేళ్ల క్రితం ప్రియురాలి కోసం స్విట్జర్లాండ్ బయల్దేరాడు. రాజస్థాన్‌లోని బికనీర్ వరకు రైలు ప్రయాణం చేసి.. అక్కడ దేశ సరిహద్దులో ఫెన్సింగ్ దూకి పొరబాటున పాక్ భూ భాగంలో ప్రవేశించాడు. వీసా, పాస్ పోర్టు లేని కారణంగా.. అక్కడి పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా జైలు జీవితం అనుభవించిన అతను.. నిన్ననే మన దేశంలో అడుగుపెట్టాడు. ఇవాళ విశాఖలోని సొంతింటికి చేరాడు.
సొంతింటికి చేరుకున్న వేళ.. కుటుంబీకులు ఉద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌ను చూసి వారు ఆనందంలో మునిగారు.
ఇదీ చదవండి: ప్రేయసి కోసం పాక్‌కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి..