ETV Bharat / city

కొన్ని చోట్ల సామాజిక దూరాలు.. మరికొన్ని చోట్ల గుంపులు - corona affect in ap

ప్రభుత్వ ఆదేశాలతో కూరగాయల మార్కెట్ల వద్ద పరిస్థితి మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ కోనుగోలు చేశారు. మరికొన్ని చోట్ల ప్రత్యేకమైన చర్యలు చేపట్టినా ప్రజలు గుంపులుగా ఎగబడ్డారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్కెట్లను మైదానాల్లోకి మార్చిన కారణంగా.. ఇబ్బందికర పరిస్థితులు తగ్గాయి.

situation-at-the-vegetable-markets-in-ap-over-corona-affevt

author img

By

Published : Mar 26, 2020, 4:05 PM IST

'కొన్ని చోట్ల సామాజిక దూరాలు..మరికొన్ని చోట్ల గుంపులు'

రాష్ట్రంలోని పలు చోట్ల కూరగాయల మార్కెట్ల వద్ద పరిస్థితి కాస్త మెరుగవుతోంది. లాక్​డౌన్ ప్రకటించిన నాటి నుంచి భారీ సంఖ్యలో మార్కెట్లకు జనం క్యూ కట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొదటి మూడు రోజులు..కనీస జాగ్రత్తలు పాటించకున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మార్కెట్లను మైదానాల్లోకి మార్చిన కారణంగా.. సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడని ప్రజలు.. పోలీసుల ఆగ్రహానికి గురవుతున్నారు.

గుంటూరు, విజయవాడ నగరాల్లోని మార్కెట్లలో ప్రజలు.. క్యూలైన్లు పాటిస్తూ కూరగాయలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కూరగాయల బజార్​ను వ్యవసాయ మార్కెట్​కు తరలించారు. సామాజిక దూరం పాటించేలా తగిన చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మార్కెట్ల వద్ద జనాలు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉరవకొండ పట్టణలోని మాంసం అమ్మకాల కేంద్రం వద్ద ప్రజలు అధిక సంఖ్యలో తరలిరాగా పోలీసులు అదుపు చేశారు. మూడు అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రత్యేకంగా మార్కింగ్ వేసి అందులోనే ప్రజలు నిలబడేటట్లు చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్​ను చేనేత మైదానంలోకి మార్చినా ప్రజలు ఎగబడ్డారు. కూరగాయలు కొనేందుకు ప్రజలు గుంపులుగా వచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యవస్థను చక్కబెట్టారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలో లాక్​ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉదయం నుంచి పాడేరు రైతు బజార్ వద్ద పోలీసులు... కొనుగోలుదారులను మార్కింగ్ తో కట్టడి చేస్తున్నారు. జనం రద్దీ కాకుండా అంబేడ్కర్ కూడలి వద్దే అదుపు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు కూరగాయల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా కడప జిల్లా రాయచోటిలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాలమైన ప్రదేశాల్లో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుదారులు దూరం పాటించేలా లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజామున మార్కెట్ ప్రారంభంతోనే జనం ఒక్కసారిగా వేలాది మంది తరలి వచ్చారు. దుకాణాల ఎదుట దూరం పాటించకుండా సామూహికంగా ముందుకొచ్చి కొనుగోలు చేయగా.. మార్కెట్ ఆవరణం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మార్కెట్​కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. క్యూలైన్లను పాటించాలని చెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మరోవైపు కొందరు అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పోలీసుల నయా స్టైల్​- రోడ్లపైకి వచ్చినవారికి వెరైటీ శిక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.