విశాఖ భూములకు సంబంధించిన అవకతవకలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. తన తుది నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో సీల్డ్ పెట్టెల్లో తిరిగి ఆయా విభాగాలకు పంపేందుకు సిద్ధం చేశారు. కొవిడ్ కారణంగా దాదాపు 8 నెలల పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అలస్యమైంది.
జనవరిలో మధ్యంతర నివేదిక ఇచ్చిన డాక్టర్ విజయ్‌కుమార్ నేతృత్వంలో సిట్ బృందం తుది నివేదిక ఇచ్చే ముందు ప్రజల నుంచి సూచలను, సలహాలను కొరింది. ఈ మెయిల్ ద్వారా దాదాపు 150 వరకు సలహాలు వచ్చాయి. గతంలో కంటే దాదాపు 20కి పైగా కొత్త ఫిర్యాదులను సిట్ పరిశీలించింది. తమ సిఫార్సులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని సిట్ ఛైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: