సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాలూరు నర్సింగరావు అనే ఉద్యోగిని... దేవాదాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. దేవస్థానం భూముల్లో మాధవధార పరిధిలోని 13 ఎకరాల్లో.. అనుమతులు లేకుండా నిర్మాణాలకు సహకరించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ అదనపుకమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్.. ఈ వ్యవహారంపై విచారణ చేశారు. అనంతరం నర్సింగరావును సస్పెండ్ చేస్తున్నట్టు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: