ETV Bharat / city

'బ్లూ ఫ్లాగ్ బీచ్'గా రుషికొండకు అరుదైన గౌరవం - విశాఖ వార్తలు

విశాఖలో ప్రఖ్యాత పర్యాటక స్థలమైన రుషికొండ బీచ్‌ అరుదైన గుర్తింపును సొంతం చేసుకొంది. అంతర్జాతీయ సందర్శకులను సైతం ఆకర్షించే బ్లూ ఫ్లాగ్‌ హోదా ఈ సాగర తీరానికి దక్కింది. అందం, ఆహ్లాదం, పరిశుభ్రత కలగలిసిన ఆకర్షణీయ బీచ్‌గా విదేశీ పర్యాటకుల మనసు దోచేందుకు రుషికొండ సిద్ధమవుతోంది.

'బ్లూ ఫ్లాగ్ బీచ్'గా రుషికొండకు అరుదైన గౌరవం

author img

By

Published : Oct 11, 2020, 6:44 PM IST

Updated : Oct 12, 2020, 6:40 AM IST

'బ్లూ ఫ్లాగ్ బీచ్'గా రుషికొండకు అరుదైన గౌరవం

విశాఖలో పర్యాటకులను అమితంగా అలరించే రుషికొండ బీచ్‌ అంతర్జాతీయ స్థాయిని అందుకొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు నెలకొల్పే దిశలో రెండున్నరేళ్లుగా సాగిస్తున్న కృషి ఫలించిన వేళ.... బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకొంది. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ జ్యూరీ మన దేశంలో రుషికొండ సహా మరో 8 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే లాంఛనంగా రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఎగరవేయనున్నారు.

ప్రధాని మోదీ చొరవ...

పర్యాటక రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందువల్లనే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ మన దేశంలోని పలు సాగర తీరాలను బ్లూ ఫ్లాగ్ స్థాయికి అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆకర్షణీయ అంశాలున్న బీచ్‌లను ఎంపిక చేసి ప్రత్యేక నిధితో అభివృద్ధి చేసేలా బీమ్స్ ప్రాజెక్టును పర్యావరణ మంత్రిత్వ శాఖ మూడేళ్లుగా అమలు చేసింది. 4 ప్రధాన అంశాలకు ప్రాధాన్యమిస్తూ 33ప్రమాణాలను నిర్దేశించుకుని రుషికొండ బీచ్‌ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేశారు. ఆ కృషి ఫలించి ఎట్టకేలకు నీలి జెండా రెపరెపలు కనువిందు చేయనున్నాయి.

బ్లూ ఫ్లాగ్‌ హోదా సాధన దిశలో రుషికొండ బీచ్‌లో పర్యావరణ హితమైన అనేక చర్యలు చేపట్టారు. సందర్శకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ గుర్తింపుతో ప్రపంచ దేశాలకు చెందిన పర్యాటకులు విశాఖ సాగర తీరానికి తరలివస్తారు. విశాఖతో పాటు రాష్ట్రానికీ ఈ హోదా పర్యాటకంగా మేలు చేకూర్చనుంది. రుషికొండ బీచ్‌ను పర్యాటకులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 7 నక్షత్రాల హోటల్ ఏర్పాటు చేయడం సహా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా కార్యచరణ అమలు చేయనుంది.

ఇదీ చదవండి:

బాలికే భవిష్యత్: చిన్నారులే కానీ... నేడు మాత్రం 'ప్రభుత్వ ఉద్యోగులు'!

Last Updated : Oct 12, 2020, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.