etikoppaka: వ్యాపారాలు లేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న ఏటికొప్పాక కళాకారులకు రైల్వే శాఖ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. విశాఖ జిల్లా ఏటికొప్పాకలోని చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు దేశంలోనే మంచి పేరు ఉంది. అటువంటి కళాకృతులను అమ్ముకునేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్‌లోని విశాఖ రైల్వేస్టేషన్ లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. 15 రోజుల పాటు వీరు ఉచితంగా వారి బొమ్మలను అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల అనంతరం వారి వ్యాపార రాబడిని బట్టి పర్మినెంట్‌గా స్టాల‌్‌ను కేటాయించనున్నారు. గతంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ఏటికొప్పాక బొమ్మల గురించి చర్చించడంతో వీటి ప్రాధాన్యత అందరికీ తెలిసింది.
ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం.. రైల్వేశాఖ వెల్లడి
ఏటికొప్పాక కళాకారులకు రైల్వేశాఖ చేయూత.. కళాకృతుల విక్రయానికి స్థలం - విశాఖ లేటెస్ట్ అప్డేట్స్
etikoppaka: ఏటికొప్పాక కళాకారులకు రైల్వేశాఖ.. చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. కళాకృతులను అమ్ముకునేందుకు రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక స్థలం కేటాయించింది. 15 రోజులపాటు ఉచితంగా బొమ్మలను అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది.
etikoppaka: వ్యాపారాలు లేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న ఏటికొప్పాక కళాకారులకు రైల్వే శాఖ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. విశాఖ జిల్లా ఏటికొప్పాకలోని చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు దేశంలోనే మంచి పేరు ఉంది. అటువంటి కళాకృతులను అమ్ముకునేందుకు వీలుగా వాల్తేర్ రైల్వే డివిజన్‌లోని విశాఖ రైల్వేస్టేషన్ లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. 15 రోజుల పాటు వీరు ఉచితంగా వారి బొమ్మలను అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల అనంతరం వారి వ్యాపార రాబడిని బట్టి పర్మినెంట్‌గా స్టాల‌్‌ను కేటాయించనున్నారు. గతంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ఏటికొప్పాక బొమ్మల గురించి చర్చించడంతో వీటి ప్రాధాన్యత అందరికీ తెలిసింది.
ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం.. రైల్వేశాఖ వెల్లడి
TAGGED:
visakha latest updates