ETV Bharat / city

ముగిసిన సిట్ ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ - visakha lands issue

విశాఖ భూరికార్డుల్లో అవకతవకలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై... ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ముగిసింది. 7 రోజుల్లో 2 వేల 434 ఫిర్యాదులు అందాయి. విభాగాల వారీగా ఫిర్యాదులను పరిశీలించనున్న అధికారులు... పురోగతి తెలిసేలా ప్రతి అర్జీదారుడికి ఒక నెంబర్ కేటాయించారు.

ముగిసిన సిట్ ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ
author img

By

Published : Nov 8, 2019, 7:31 AM IST

ముగిసిన సిట్ ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ

విశాఖ భూఆక్రమణలపై ప్రభుత్వం నియమించిన సిట్... వీఎంఆర్​డీఏ థియేటర్‌ వేదికగా ఈ నెల 1 నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. విశాఖ గ్రామీణ, ఆనందపురం, భీమిలి, గాజువాక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. రికార్డుల మార్పులు, ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మిన దాఖలాలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఇచ్చిన భూములు, సింహాచలం భూములు సహా... ప్రభుత్వ స్థలాల కబ్జాలపైనా అర్జీలు వచ్చాయి.

అటవీశాఖకు చెందిన 868 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు... డీఎఫ్​వో సెల్వం ఫిర్యాదు చేశారు. కంబాలకొండ, నరవ, తీడా రిజర్వ్ ఫారెస్టుల పరిధిలో ఈ భూమి ఉందని... సంబంధిత రికార్డులు ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవధారలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాపై భాజపా మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేశారు. అడవివరం, కప్పరాడల్లోనూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అయ్యాయంటూ.... తెలుగుదేశం నేతలు సిట్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఏడు రోజులపాటు స్వీకరించిన ఫిర్యాదులను... 7 విభాగాలుగా విభజించి అధ్యయనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భూవివాదాల పరిష్కారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని.... సిట్ పారదర్శకంగా విచారణ చేసి నాయ్యం చేయాలని ఫిర్యాదుదారులు కోరారు. వీఎంఆర్​డీఏ థియేటర్‌లో అర్జీల స్వీకరణ ముగిసినా... నేరుగా సిట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండీ... ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.