విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఉక్కు ఉద్యమం 200 రోజుల సందర్భంగా విశాఖలో మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 కిలో మీటర్లు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల కుటుంబాలు, నగరవాసులు పాల్గొన్నారు. లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం కావాలనే... నష్టాల బాటలో నడుపుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతోనే ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం