స్టీల్ సామగ్రిని సెంట్రల్ డిస్పాచ్ యార్డు నుంచి స్టీల్ ఏరియా వరకు వేగంగా రవాణాకు ఓహెచ్ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని, ఈ లైన్ విద్యుద్దీకరణ పనిలో సామర్థ్యం పెరుగుదల సాధ్యపడుతుందన్నారు. 25 కేవీ ఏసీ పవర్డ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ ద్వారా విద్యుత్తు సరఫరా కోసం సెంట్రల్ డిస్పాచ్ యార్డు నుంచి 255 పోల్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల రైళ్ల ద్వారా నేరుగా ప్లాంట్ యార్డులోనే లోడ్ అయిన సరకు దేశంలో ఏ ప్రాంతానికైనా మధ్యలో ఎక్కడా మార్చకుండా పంపేందుకు వీలవుతుంది. ఇది రవాణాలో మరింత ముందడుగుగా ఉంటుందని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: ఎస్వీబీసీలో అటెండర్ తొలగింపు.. కారణం అదే!