NTPC Ash Pond Pollution: విశాఖ జిల్లా పరవాడ మండలం ఎన్టీపీసీ సింహాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం యాష్ పాండ్ కాలుష్యంతో.. సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిత్యం ఇళ్లలో బూడిద పేరుకుపోవడం అటుంచితే.. వృద్ధుల అనారోగ్య సమస్యలు వర్ణనాతీతం. ఇటీవల పిట్టవానిపాలెం వాసి ఫిర్యాదుతో జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సదరు కమిటీ.. పిట్టవానిపాలెం, మరడదాసరిపేట, దేవాడ గ్రామాలను సందర్శించింది.
బూడిద ప్రాణాంతకంగా మారిందని.. బాధిత గ్రామాల ప్రజలు కమిటీకి వివరించారు. తిండి, గాలి, నీరు, ఇళ్లు కాలుష్యమయం అవుతున్నాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా భూగర్భజలాలు కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటోందని.. ఇక్కడి జనం వాపోయారు. కమిటీ బృందంలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల ముఖ్య అధికారులు ఉన్నారు. మట్టి, నీరు నమూనాలు నిశితంగా పరిశీలిస్తామని వివరించారు.
ఇదీ చదవండి
Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే..