ETV Bharat / city

పుస్తకాలను చదవడమే కాదు.. ఈ పరికరంతో వినవచ్చు! - విశాఖ జిల్లా తాజా వార్తలు

పుస్తకాలను చదవడమే కాదు. వినవచ్చు కూడా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అది సాధ్యమే. దిల్లీకి చెందిన ఓ సంస్థ సంపూర్ణ హనుమాన్ చాలీసా, భగవద్గీత సంస్కృత గ్రంథాలను ఈ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇటీవల ఈ గ్రంథాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్.. తిరుపతిలో ఆవిష్కరించారు.

Not just reading books
Not just reading books
author img

By

Published : Nov 25, 2020, 10:10 AM IST

పుస్తకాలను చదవడం రాకపోయినా..లేక తీరిక లేకపోయినా.. విని ఆనందించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దిల్లీకి చెందిన ఓ సంస్థ సంపూర్ణ హనుమాన్ చాలీసా, భగవద్గీత సంస్కృత గ్రంథాలను ఈ పరిజ్ఞానంతో రూపొందించింది.

విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఈబీసీ కాలనీకి చెందిన కొర్రపాటి కుసుమ కుమారికి.. ఆమె కుమారుడు సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఇచ్చారు. పుస్తకంలోని అక్షరాలపై సెల్​ఫోన్ లాంటి పరికరాన్ని (గ్యాన్ వజ్రా) ఉంచితే అది శ్లోకాలు, పద్యాలు చదివి వాటి తాత్పర్యాలూ వినిపిస్తుంది. శబ్దం పెంచుకునే , తగ్గించుకునే సౌలభ్యం ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠి, కన్నడ, అస్సామీ, గుజరాత్, నేపాలీ భాషల్లోనూ వినవచ్చు. దిల్లీకి చెందిన ఓ సంస్థ సంపూర్ణ హనుమాన్ చాలీసా, భగవద్గీత సంస్కృతి గ్రంథాలను ఈ పరిజ్ఞానంతో రూపొందించింది.

ఇదీ చదవండి:

అతి తీవ్ర తుపానుగా 'నివర్'.. నేడు తీరం దాటే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.