ETV Bharat / city

నానో మాస్క్... దీని మీద పడితే వైరస్ చచ్చిపోవాల్సిందే..!

కరోనాను చంపడానికి వ్యాక్సిన్లు, ముందులపై పరిశోధనలు చాలానే జరుగుతున్నాయి. కానీ విశాఖకు చెందిన శేషగిరిరావు మరో ఇద్దరితో కలిసి కరోనా లోపలికి వెళ్లకుండానే వైరస్ చనిపోయే మార్గం కనుగొన్నారు. కరోనా పుణ్యమా అంటూ మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. మాస్క్ పెట్టుకుంటేనే గాని గడప దాటని స్థితి. సాధారణ మాస్కులు కేవలం వైరస్​ను అడ్డుకుంటాయి. ఐతే వీరు తయారు చేసిన మాస్క్ ఏకంగా వైరస్​నే చంపేస్తుంది.

author img

By

Published : Jul 10, 2020, 6:14 PM IST

nano mask discovered by vishaka guy
నానో మాస్క్

విశాఖకు చెందిన శేష గిరిరావు రెండు దశాబ్దాలకు పైగా లెదర్ బ్యాగులు, బెల్ట్ ఉత్పత్తులు తయారుచేసే యూనిట్​లను నడుపుతున్నారు. దిల్లీ ఐఐటీ ఈ ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ మాజీ సభ్యుడు కెవి రమణ, ఏయూ పోస్ట్ డాక్టరల్ ఫెలో దేముడుతో కలిసి ఈ మాస్క్ అభివృద్ధి చేశారు. నానో ఫోటానిక్ ఫిల్టర్ మాస్క్- 99 అని దీనికి పేరు పెట్టారు.

వైరస్​ను అంతం చేసే మాస్క్ తయారీ

ఇది నానో మెటీరియల్​తో తయారవుతుందని... ఎలాంటి వైరస్​ని అయినా చంపుతుందిని శేషగిరిరావు తెలిపారు. ఒక్క మాస్క్ కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని తెలిపారు. ప్రత్యేకమైన ఈ మాస్క్ వైరస్​ను పూర్తిగా నిర్మూలిస్తుందని... మానవ శరీరానికి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక లేయర్లు మాస్క్​పై ఏర్పాటు చేసినట్లు శేషగిరిరావు తెలిపారు.

దీనికి అనుమతుల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్​లో ఇప్పటికే పూర్తి వివరాలతో దరఖాస్తు చేశామని శేషగిరిరావు తెలిపారు. అనుమతి వచ్చిన తర్వాత దీనిని వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఎంతగానే ఉపయోగపడుతుందని శేషగిరిరావు వివరించారు.

ఇదీ చదవండి: 'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే - కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.