ETV Bharat / city

మురికివాడలు లేని విశాఖ నగరాన్ని సృష్టిస్తాం: ఎంపీ విజయసాయి

పురపాలక ఎన్నికలకు ముందు విశాఖ నగర పాలక పరిధిలో ఇచ్చిన ప్రతి హామీని యుద్ధప్రాతిపదికన నెరవేర్చుతామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మురికివాడలు లేని విశాఖ నగరాన్ని సృష్టిస్తామన్నారు.

mp vijaysaireddy on gvmc developments
మురికివాడలు లేని విశాఖ నగరాన్ని సృష్టిస్తాం
author img

By

Published : Apr 16, 2021, 4:23 PM IST

మురికివాడలు లేని విశాఖ నగరాన్ని సృష్టిస్తామని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ పరిధిలోని 51వ వార్డు ఏకలవ్య కాలనీలో రూ. 176.34 లక్షల నిధులతో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి అవంతి, నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎంపీ సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు.

పురపాలక ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని యుద్ధప్రాతిపదికన నెరవేర్చుతామని తెలిపారు. నగర పరిధిలోని 740 మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏకలవ్య కాలనీలో నివాస స్థలాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. మురికివాడల్లో సామాజిక భవనాలు, పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు.

ఇదీచదవండి

విచారణ కోసం.. వివేక మాజీ డ్రైవర్​ను దిల్లీ తీసుకెళ్లిన సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.