కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కోసం ప్రతీ రైల్వే స్టేషన్ ఒక ప్రమోషన్ హబ్‌గా అవుతుందని అధికారులు వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్‌గా విశాఖ ఎంపిక చేశారని, ఈ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, వాల్టేర్ సీనియర్ డీసీఎం కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: TDP Protest: జే బ్రాండ్‌తో సీఎం జగన్ జనాల ప్రాణాలు తీస్తున్నారు: తెదేపా