విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోబోమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. ఉక్కు ఉద్యమ సెగ దిల్లీకి తగిలేలా చూస్తామని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్ లోపల, బయట ప్రభుత్వం తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. ఎంతోమంది ప్రధానులు వస్తుంటారు.. పోతుంటారని.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కార్మిక సంఘాలతో భేటీ..
స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి భేటీ అయ్యారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో జరిగిన సమావేశమైన ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా స్టీల్ ప్లాంట్ అంశంపై భేటీలో నేతలు ప్రస్తావించారు.
నష్టాల్లో ఉందనే సాకుతో స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామనడాన్ని విజయసాయిరెడ్డి వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు ఇవ్వాలని ఈ సందర్భంగా అన్నారు. నష్టాలు భర్తీ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కోసం బయట నుంచి గనులు ఇవ్వక్కర్లేదని.. రాష్ట్ర సరిహద్దు కోటియాలో గనులు ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఉక్కుమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు భాజపాయేతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా పూర్తిగా వ్యతిరేకమని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి:
AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!
jagan bail: 'జగన్ బెయిల్ రద్దు పిటిషన్'పై.. కీలక పరిణామం!