రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు కేంద్రాలను 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థలు అంగీకరించాయన్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ నాడు- నేడు కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. పెట్రో కెమికల్ కారిడార్ లో 2 పెట్రో కెమికల్ పరిశ్రమల ఏర్పాటు కానున్నాయన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
డిసెంబర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులను డిసెంబర్ 15 నాటికి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దేదుకు ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు. వర్క్ ఫ్రొం హోమ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నెట్ వేగాన్ని పెంచే కార్యాచరణ చేపట్టామని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: