Minister avanthi Initiated OTS Registrations: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. పేద ప్రజలకు శాశ్వత గృహహక్కు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి, రాజకీయ దురుద్దేశాలు లేకుండా ప్రజలకు మేలు చేసేదే ఈ ఓటీఎస్ పథకమని మంత్రి అని కొనియాడారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకురావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
ప్రతిపక్షాల కుట్రలు చేయడం సరికాదు..
Minister avanthi Fire on Chandrababu: ప్రజలకు మేలు చేసేఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు కుట్రలు చేయడం సరికాదన్నారు. ఓటీఎస్‌పై చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించారు. అధికారంలోకి వస్తే ఫ్రీగా ఈ రిజిస్ట్రేషన్లు చేస్తానని చెబుతున్న చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
అనంతరం లబ్దిదారులతో కలిసి సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరి రుణవిముక్తులు పొందాలన్నారు. అయితే ఎవరిని బలవంతం చేయట్లేదని మంత్రి అవంతి అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కల్పన, ఆర్డీవో పి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.