సినిమాకు, నిజ జీవితానికి పవన్‌కు తేడా తెలియట్లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ లాంగ్ మార్చ్ లో అజ్ఞానంగా మాట్లాడారని విమర్శించారు. పవన్... అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని చురకలు అంటించారు. కాపు యువతను పెడదోవ పట్టించేలా పవన్ ధోరణి ఉందన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు... పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం దేశ చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు కొమ్ము కాయడానికే పార్టీ పెట్టారా అని జనసేనానిని మంత్రి అవంతి ప్రశ్నించారు.
ఇవీ చూడండి