ETV Bharat / city

'ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి, తొట్లకొండకు కిలోమీటరు దూరం ఉంది' - తొట్లకొండ తాజా వార్తలు

విశాఖలో ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణంపై వస్తున్న ఆరోపణలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ఖండించారు. అతిథి గృహ నిర్మాణానికి, తొట్లకొండకు కిలో మీటరు దూరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి రహస్య శంకుస్థాపనలు వర్తించవని చెప్పుకొచ్చారు.

minister avanthi gives clarity on thotlakonda issue
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : Aug 25, 2020, 12:31 AM IST

ప్రభుత్వ అతిథి గృహం నిర్మించే స్థలానికి, తొట్లకొండకు సంబంధం లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తొట్లకొండకు, బావికొండకు... ఇప్పుడు ప్రభుత్వం నిర్మిద్దామనుకుంటున్న స్థలానికి కిలోమీటరు దూరం ఉందని ఆయన తెలిపారు. దీనిపై రాజకీయ నేతలు వివాదాలు చేయవద్దని చెప్పారు. తొట్లకొండలో బౌద్ధక్షేత్రం, ఇతర బౌద్ధ స్తూపాల పరిధి గల 120 ఎకరాల చుట్టూ రక్షణ కంచె ఉందని మంత్రి తెలియజేశారు. కచ్చితంగా తొట్లకొండను ప్రపంచ బౌద్ధ పవిత్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి తెలిపారు.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం అనేది ప్రభుత్వ కార్యక్రమమని... దానికి రహస్య శంకుస్థాపనలు వర్తించవని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణాలకు జిల్లా కలెక్టర్​ చైర్మన్​గా వ్యవహరిస్తుంటారని... విశాఖ, విజయవాడ, కాకినాడ, కర్నూల్​లో అతిథి గృహాల నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి :

తొట్లకొండ భద్రత పట్ల బౌద్ధ సంఘాల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.