ETV Bharat / city

ఉక్కు సంకల్పంతో విశాఖ స్టీల్​ ప్లాంట్​ను కాపాడుకుందాం: చిరంజీవి

ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

megastar chiranjeevi
megastar chiranjeevi
author img

By

Published : Mar 10, 2021, 8:43 PM IST

Updated : Mar 10, 2021, 9:55 PM IST

  • Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions.

    With a Steely resolve,
    Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim

    — Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు త్యాగాలకు గుర్తని తెలిపారు. విశాఖ ఉక్కు రక్షణకు ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి అంతా కలిసి రావాలని ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్‌ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్‌ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం'- మెగాస్టార్ చిరంజీవి

ఇదీ చదవండి

'ది క్రిమినల్ లాస్ సవరణ బిల్లు-2019' ఏపీ ప్రభుత్వం వద్దే ఉంది: కేంద్ర న్యాయశాఖ మంత్రి

Last Updated : Mar 10, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.