ETV Bharat / city

Murder in Gajuwaka: హత్య చేసి... అనంతరం..! - వ్యక్తి దారుణ హత్య

Murder in Gajuwaka: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. అసలేం జరిగిందంటే..?

Murder
హత్య
author img

By

Published : Sep 20, 2022, 1:23 PM IST

Murder in Gajuwaka: విశాఖ గాజువాక హైస్కూల్ రోడ్డు సమీపంలోని పెంటయ్య నగర్​లో దారుణ హత్య జరిగింది. తెల్లవారుజామున రమణ అనే యువకుడిని కిరాతంగా చంపి... గాజువాక పోలీస్ స్టేషన్​లో నిందితుడు యేసురాజు లొంగిపోయాడు. గాజువాకలోని చికెన్ సెంటర్​లో రమణ, యేసురాజు ఇద్దరు నెలవారీ జీతానికి పని చేస్తూ... పెంటయ్య నగర్​లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.

నిన్న రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ ఏర్పడి తర్వాత సర్దుకొని ఇద్దరూ పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే విషయం మీద ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. పక్కనే ఉన్న ఇనుప గొట్టంతో రమణ తలపై యేసురాజు కొట్టడంతో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత యేసురాజు గాజువాక పోలీసుస్టేషన్​కు వెళ్లి 'రమణను చంపేసాను' అని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.