ఒక్కఅవకాశం ఇచ్చినందుకు స్టీల్‌ప్లాంట్‌ను సీఎం జగన్ అమ్మేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విశాఖలోని గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. విశాఖ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందని.. రెండేళ్లలో ఒక్క రోడ్డుపై గుంతైనా పూడ్చారా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 21 వేలకు పెంచుతామని.. అన్న క్యాంటీన్లు 100 రోజుల్లో తెరుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది'