విశాఖలో ఇవాళ ఉదయం జీవీఎంసీలోని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు లాక్డౌన్ ఉన్నా కొంతమంది నిబంధనలు పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. మీ కోసమే మేం కష్టపడేది అనుకుంటూ ఆమె రోడ్డుపై చెత్తను శుభ్రం చేస్తూ ఓ ఇంటి ముందుకొచ్చింది. ఆమె చేస్తున్న పనిని గమనించిన ఇద్దరు చిన్నారులు.. మహిళను ఇంటికి తీసుకెళ్లారు. కరోనా వైరస్ విజృంభణలో సైతం.. తమ కోసం కష్టపడుతున్న ఆమె కాళ్లు కడిగి.. పసుపు రాసి ఆమె పాదాలకు నమస్కరించారు. అనంతరం చీర, జాకెట్టు, తాంబూలం ఇచ్చి సత్కరించారు. నిబంధనలను పట్టించుకోకుండా తిరిగే పెద్దల కంటే పెద్ద మనసున్న ఈ చిన్నారులు చేసిన పని.. ఎంతో గొప్పది కదూ..!
ఇదీ చదవండి: 'కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి'