విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో 258 నర్సింగ్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తాత్కాలిక సేవల పద్ధతిన నర్సులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏడాది కాలానికి నియామకం ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, ఇతర వైద్య నిపుణులు కలిగిన ఐదుగురి సభ్యులున్న ఎంపిక కమిటీ ఈ పోస్టులు భర్తీ చేయనుంది.
అభ్యర్థులు అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుని ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు ఏడాది కాలం పాటు కేజీహెచ్ లో, నిర్దేశించిన ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకించి విశాఖలో ఉన్న బోధనా ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బోధన ఆసుపత్రుల్లో సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ చదవండి : 'డాక్టర్ పట్టించుకోవట్లేదు..ఆక్సిజన్ పెట్టట్లేదు..ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'