విశాఖలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి కోసం కేజీహెచ్ ఆస్పత్రి వైద్యాధికారులు ఎదురుచూస్తున్నారు. ఈలోపు సంబంధిత ప్రక్రియపై వారు దృష్టి సారించారు. ఇవాళ కేజీహెచ్‌లో జరిగే ఎథిక్స్ కమిటీ భేటీలో ఆస్పత్రిలో ఉన్న వసతులపై చర్చించనున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ సందర్భంగా దుష్ప్రభావాలు తలెత్తితే చేపట్టాల్సిన చర్యలపైనా మేధోమథనం జరపనున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే విధానంపై డాక్టర్ వసుదేవ్ ప్రజెంటేషన్ ఇస్తారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు కేజీహెచ్‌ను ఎంపిక చేసిన ఐసీఎంఆర్.... ఏఎంసీ ఆచార్యులైన డాక్టర్ వసుదేవ్‌కు ప్రక్రియ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.
ఇదీ చూడండి..