Janasena seeks DGP Appointment: జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించటం, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిసి చర్చించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు సమయం కోరుతూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డీజీపీకి లేఖ రాశారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం డీజీపీని కలిసి సమస్యలపై చర్చించేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలపాలని నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి