ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన బహిరంగ సభ.. చురుగ్గా ఏర్పాట్లు - స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతరేకంగా జనసేన బహిరంగ సభ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జనసేన తలపెట్టిన బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. నిర్వహించనున్న సభలో జనసేనాని పవన్ పాల్గొననున్నారు

జనసేన బహిరంగ సభ
జనసేన బహిరంగ సభ
author img

By

Published : Oct 30, 2021, 10:31 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన ఆదివారం తలపెట్టిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించే సభకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన జనసేన నాయకులు విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకు చేపడుతున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు అవసరమైన అన్ని అనుమతులనూ పోలీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

బహిరంగ సభకు భారీ సంఖ్యలో వాహనాలు తరలిరానున్న క్రమంలో ట్రాఫిక్​కు ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్ స్థలాలను పోలీసులు ఎంపిక చేశారు. బహిరంగ సభకు విశాఖపట్నం వైపు నుంచి వచ్చే అన్ని వాహనాలూ పాత గాజువాక జంక్షన్ దాటిన తర్వాత గాజువాక పోలీస్ స్టేషన్ నుంచి ఎడమ వైపుకు తిరిగి జగ్గు జంక్షన్, వై జంక్షన్, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్, కేబీఆర్ జంక్షన్ మీదుగా చైతన్య కాలేజీ జంక్షన్​కు చేరాలని తెలిపారు. కార్లు, ఆటోలు చైతన్య కాలేజీ గ్రౌండ్​లో నిలపాలని, బస్సులు మాత్రం తెలుగు తల్లి విగ్రహం సమీపంలో ఉన్న నెహ్రూ పార్క్ వద్ద పార్క్ చేయలని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి

విశాఖలో జనసేన బహిరంగ సభకు పోలీసుల అనుమతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.