విశాఖ గీతం యూనివర్సిటీలో కూల్చివేసిన నిర్మణాలను తెదేపా బృందం పరిశీలించింది. విద్యాసంస్థలతో రాజకీయాలు చేయడం తగదని ఆ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వైఎస్ హయాంలోనే కట్టడాలు కూలగొట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయని... విద్యాసంస్థ కావటంతో వైఎస్ తన నిర్ణయాన్ని విరమించుకున్నారని తెలిపారు. రోశయ్య హయాంలో క్రమబద్ధీకరణకు ప్రయత్నించారని... అందుకు సంబధించిన దస్త్రం ఇప్పటికీ ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న దాన్ని పరిష్కరించకుండా కూల్చేయటం సరికాదని హితవు పలికారు. ప్రతిష్టాత్మక సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం 1200 ఎకరాల తీసుకుని... దానికి వీఎంఆర్డీఏ నుంచి 24 కోట్లు విడుదల చేసి, మొత్తం స్వాహా చేశారని అయ్యన్న ఆరోపించారు. దీనిపై తాను ప్రశ్నిస్తే ఇంత వరకు అధికారపక్షనేతలు సమాధానం చెప్పలేదన్నారు. ప్రేమ సమాజం భూములు కొట్టేయడానికి కూడా యత్నాలు చేస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డి కన్నువీటిపై పడిందని... దేవాదాయ శాఖ పరిధిలోకి దీనిని మార్చి ఆ భూములను కాజేయడానికి పక్కా ప్రణాళిక రచించారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాసు ఇతర నేతలు కూల్చిన నిర్మణాలను పరిశీలించారు.
ఇదీచదవండి