పేదలకు మంచి చేసేందుకు తన వంత కృషి చేస్తానని సివిల్స్‌లో 320వ ర్యాంకు సాధించిన ధీరజ్ అన్నారు. విశాఖలో ఈటీవీ భారత్‌తో మాట్లాడిన ఆయన... తన అనుభవాలను పంచుకున్నారు. గతంలో సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి నుంచి మెలకువలు తెలుసుకున్నానని చెప్పారు. వర్తమాన అంశాలపై క్రమం తప్పకుండా దృష్టి సారించానని అన్నారు. మెయిన్స్ వరకు వస్తే... అంశం వారిగా పట్టు సాధించాలని, ప్రత్యేకంగా నోట్స్‌ను తయారుచేసుకున్నానని వెల్లడించారు. తెలుసుకున్న ప్రతి విషయాన్ని రివైజ్ చేసుకోవటంతో చాలా సులభం అయిందన్నారు. సివిల్స్ సాధనలో విశ్లేషణాత్మక నైపుణ్యం అత్యంత ముఖ్యమని వివరించారు. ముఖాముఖిలో మన నేపథ్యాన్ని బట్టి ప్రశ్నలను అడుగుతారని తెలిపారు. మూడు రాజధానులు మంచిదేనా వంటి ప్రశ్నలను కూడా తన ఇంటర్వ్యూలో అడిగారని చెప్పారు.
ఇదీ చదవండి