విశాఖ వేదికగా నవంబర్ 22 నుంచి 17వ అంతర్జాతీయ వోడోకాయ్ కరాటే పోటీలు నిర్వహించనున్నట్లు... ఏపీ వోడోకాయ్ సమాఖ్య ప్రతినిధి సతీష్ తెలిపారు. గతేడాది ఈ పోటీలు నేపాల్‌లో జరిగాయని... ఈ ఏడాది విశాఖలో నిర్వహించేందుకు అంతర్జాతీయ సమాఖ్య సభ్యులు అంగీకరించారని నిర్వాహకులు వివరించారు. ఇప్పటికే 15 దేశాలకు చెందిన క్రీడాకారులు విశాఖ రావడానికి నమోదు చేసుకున్నారని... ఒలంపిక్స్‌లో పాల్గొనబోయే ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటారని చెప్పారు.
2రోజులు జరిగే ఈ టోర్నీని ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖలోని మర్రిపాలెం వద్ద నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. క్రీడాకారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విశాఖలో అంతర్జాతీయ కరాటే పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...'చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఓ నాటకంలో పాల్గొన్నాం'